Australia team: భారత్ తో చివరి రెండు టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. 2 d ago
బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో మిగిలిన రెండు టెస్టులకు 15 మంది ఆటగాళ్లతో ఆస్ట్రేలియా జట్టును ప్రకటించింది. ఓపెనర్ నాథన్ మెక్ స్వినీపై వేటు వేసిన ఆసీస్, అతడి స్థానంలో 19 ఏళ్ల సామ్ కొంస్టాస్ను జట్టులోకి తీసుకుంది. ఉస్మాన్ ఖవాజాతో కలిసి కొంస్టాస్ ఓపెనింగ్ చేసే అవకాశముంది. అదేవిధంగా పేసర్ జే రిచర్డ్సన్ ను మూడేళ్ల తర్వాత తిరిగి జట్టులోకి ఎంపిక చేసింది ఆస్ట్రేలియా. రిచర్డ్సన్తో పాటు మరో పేసర్ సీన్ అబాట్ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ఆసీస్ జట్టు:
పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్, సీన్ అబాట్, స్కాట్ బోలాండ్, అలెక్స్ కెరీ, జోష్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖవాజా, సామ్ కొంస్టాస్, మార్నస్ లబుషేన్, నాథన్ లియోన్, మిచెల్ మార్ష్, రిచర్డ్సన్, మిచెల్ స్టార్క్, బ్ల్యూ వెబర్.